ముదినేపల్లి మండలం గురజకు చెందిన కోడూరు విజయలక్ష్మి (69) మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత నెల 30న విజయవాడలో బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగివస్తూ, ముదినేపల్లిలోని గురజ సెంటరులో ఆర్టీసీ బస్సు దిగుతుండగా పడిపోయి తలకు గాయాలయ్యాయి. గుడివాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరభద్రరావు తెలిపారు.