ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, హైదరాబాదులో మత కల్లోలాలు సృష్టించిన చరిత్ర జగన్‌కు ఉందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల ఆసరాగా చేసుకొని జగన్ ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఎన్ని చేసినా కూటమి పదిలంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ కల్తీలో దోషులకు శిక్ష పడుతుందని కూడా ఆయన అన్నారు.