మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు. శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి నిరోధక కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు పిల్లలు బానిసలు కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మాదకద్రవ్యాల నివారణపై సమాచారం లేదా సహాయం కోసం 14446, 1972 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.