ఏలూరు శనివారపు పేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో జిల్లా అధికారి రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. బడికి దూరమైన పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని అధికారులను ఆదేశించారు.