ఏలూరు జిల్లాలో మండలాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న గృహ నిర్మాణాల్లో అసంపూర్తి గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం సబ్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో గృహ నిర్మాణ అంశంపై కలెక్టర్ టేలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిఎంఏవై 1.0 కింద ఇళ్లు మంజూరైనాయని అన్నారు.