జిల్లాలో డీజిల్ సరఫరాపై కలెక్టర్ సోమవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రబీ, ఆక్వా రైతులకు ఇబ్బంది కలగకుండా 152 బంకుల వద్ద వీఆర్వో స్థాయి సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లో 9491041419, టోల్ ఫ్రీ నంబర్ 1800 2331077తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇంధన పంపిణీలో అక్రమాలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.