జిల్లాలో 'జలధార- జలహారతి' పనుల్లో అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్ తప్పదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల అధికారులతో ఆమె సమీక్షించారు. చెరువులు, కాలువల్లో కేవలం ఆరు అంగుళాలు కాకుండా కనీసం రెండడుగుల మేర పూడికతీత పనులు చేపట్టాలని, నిబంధనలు పాటించకుండా అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.