ఏలూరు సీఆర్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 13న సుమారు 5000 మందితో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యోగాంధ్రను విజయవంతం చేయాలని జేసీ ధాత్రిరెడ్డి పిలుపునిచ్చారు. ఏలూరు కలెక్టరేట్లో కార్యక్రమ నిర్వహణపై మంగళవారం అధికారులతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం 6. 30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. యోగాసనాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులకు సూచించారు.