ఏలూరు జిల్లాలో ఈ నెల 28 ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,094 బూత్‌ల ద్వారా 2,79,861 వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేశారు. ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ కోరారు.