ఏలూరు జిల్లా ఎస్పీ కీలక సూచనలు

1661చూసినవారు
తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా వారి వారి గృహాలలో ఉండాలని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. అవసరం లేకుండా బయట తిరగవద్దని, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుఫాను సమయంలో ప్రయాణాలు అంత మంచిది కాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్