ఏలూరు: తాగునీటి సమస్యకు త్వరలోనే చెక్

64చూసినవారు
త్రాగునీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. ఏలూరు 4వ డివిజన్‌ మారుతీ నగర్‌లో నూతనంగా నిర్మిస్తోన్న రోడ్డు, డ్రైన్‌ నిర్మాణ పనులను శుక్రవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. ఈ సందర్భంగానే ఆ ప్రాంతంలోని ప్రజలు తమ రోడ్డుకు కూడా డ్రైన్‌ వ్యవస్థను అనుసంధానం చేయాలని కోరడంతో ఆ దిశగా ఎమ్మెల్యే అడుగులు వేశారు.

సంబంధిత పోస్ట్