ఏలూరులోని శ్రీ కుంకుళ్ళమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం, దసరాలో ఆరవ రోజున, శ్రీ లలిత త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శంకు చక్రాలు, శూలాన్ని ఆయుధాలుగా ధరించి, అభయ హస్తంతో, విశేష పుష్పాలంకరణతో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు. ప్రతిరోజూ అమ్మవారు విభిన్న అలంకరణలలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు.