ఏలూరు: వారికి ఉచితంగా న్యాయ సలహాలు

56చూసినవారు
ఏలూరు: వారికి ఉచితంగా న్యాయ సలహాలు
ఉమ్మడి ప. గో. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ ఏలూరు మండలం తంగెళ్ళమూడిలోని విన్సెంట్ డిపాల్ మానసిక విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలో అందిస్తున్న వైద్య, ఆహార సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ పథకాలను పొందటంలో గాని, ఆస్తుల పొందటంలో సమస్యలుంటే ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామన్నారు.