ఏలూరు జంగారెడ్డిగూడెం పర్యటనకు వెళుతూ మార్గమధ్యలో ద్వారకా తిరుమల వచ్చిన ఎంపీ మహేష్ యాదవ్ కు యాదవ సంఘం తరపున శనివారం ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ద్వారకా తిరుమలలోని కళ్యాణ మండపం ఆధునీకరణ పనులకు 1 కోటి రూ. మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా తమ ఆఫీసుకి రావొచ్చని ఎంపీ చెప్పారు. శుభకార్యాలకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన స్థానిక నేతలకు ఎంపీ అభినందనలు తెలిపారు.