ప్రియురాలు తనను దూరం పెట్టిందన్న కక్షతో ఉంగుటూరుకు చెందిన కోరాడ సురేశ్ అనే వ్యక్తి అమానుషానికి పాల్పడ్డాడు. వివాహిత అయిన తన ప్రియురాలిని గత నెల 31న నాచుగుంట శివారు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, చెట్టుకు కట్టేసి కోళ్లను కాల్చే సిలిండర్‌తో కాల్చి గాయపరిచాడు. బాధితురాలు ప్రస్తుతం తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు.