ఏలూరు చెంచుల కాలనీకి చెందిన మోరు పావని (23) అనే యువతి ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రుల నిరాకరణతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ నెల 25న తాను ప్రేమిస్తున్న వ్యక్తి గురించి తండ్రికి చెప్పగా, ఆయన అంగీకరించలేదు. దీంతో 26న తమ ఇంటి బిల్డింగ్ పైనుంచి దూకింది. కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పావని తండ్రి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.