ఏలూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

974చూసినవారు
ఏలూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఏలూరు వన్ టౌన్ పెద్ద మార్కెట్లో చికెన్ దుకాణం నిర్వహిస్తున్న షేక్ కరీముల్లా (26) అనే యువకుడు బుధవారం రైల్వే ట్రాక్ పై బహిర్భూమికి వెళ్తుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ దానం ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్