ఏలూరు: రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి

1176చూసినవారు
ఏలూరు: రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి
ఏలూరు శివారు తేలప్రోలు - నూజివీడు మధ్య కోడూరుపాడు మూసివేసిన రైల్వే గేటు సమీపంలో సుమారు 35 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. రైలు నుంచి ప్రమాదవశాత్తు పడి మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, వంకాయ రంగు చొక్కా, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్