ఏలూరు పోలవరం నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ అమరావతిలో శనివారం శాసన మండల సభ్యులు కొణిదల నాగబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై వినతి పత్రాన్ని వారికి అందించారు. నాగబాబు అభివృద్ధిపై సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే బాలరాజు, రవికుమార్ తెలిపారు.