మాజీమంత్రి అంబటి రాంబాబుపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరువును తాకట్టు పెట్టేలా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు ఇలాంటి భాష వాడితే కార్యకర్తలు సహనం కోల్పోతారని హెచ్చరించారు.