శనివారం రాత్రి కాశీబుగ్గ ఆలయంలో జరిగిన విషాద ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భక్తుల ఒత్తిడి కారణంగానే రైలింగ్ కూలి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం చెబుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.