ఏలూరు: పరస్పరం ఒకరిపై ఒకరు కత్తితో దాడి

191చూసినవారు
ఏలూరు: పరస్పరం ఒకరిపై ఒకరు కత్తితో దాడి
ఏలూరు నగరంలోని శనివారపు పేటలో బుధవారం మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఇరువురు పరస్పరం కత్తితో దాడి చేసుకోవడంతో గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ సహాయంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘర్షణకు దారితీసిన కారణాలపై విచారణ జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్