ఏలూరు: త్రాగు నీటి ఎద్దడితో నియోజకవర్గంలో ప్రజల ఏ ఒక్క గొంతు ఎండకూడదనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం తెలిపారు. బయ్యనగూడెం గ్రామ పరిధిలోని వెలగలదిబ్బ కాలనీలో జల జీవన్ మిషన్ నిధులతో సుమారు రూ. 24. 58 లక్షల అంచనా వ్యయంతో నూతన మంచినీటి ట్యాంకు నిర్మాణానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్థానిక కూటమి నాయకులతో కలసి గురువారం భూమి పూజ చేసారు.