ఏలూరులో భారీ వర్షాల కారణంగా వాగులు, ఉపనదులు పొంగి గోదావరిలో కలవడంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 44. 30 అడుగులుగా నమోదయింది. నదిలో 9,88,792 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం 46.60 అడుగుల వద్ద ఐదు గంటల పాటు నిలకడగా ఉన్న నీటిమట్టం తర్వాత క్రమేణా తగ్గుముఖం పట్టింది.