ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అంబులెన్సుల నిర్వహణపై ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆసుపత్రిని సందర్శించి అంబులెన్సులను పర్యవేక్షించారు. అంబులెన్సులు సరిగా పనిచేయడం లేదన్న వార్తలు పూర్తిగా వాస్తవ రహితమని ఆయన స్పష్టం చేశారు. కావాలనే పాడైపోయిన, వినియోగంలో లేని అంబులెన్సులను చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.