ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి రోడ్డులోని కేజీఎన్ వెల్డింగ్ షాపులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. పనిలో ఉండగా మంటలు చెలరేగడంతో బషీర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలిస్తున్నారు. బాధితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.