ఏలూరు: నగరం లోని మెయిన్ బజార్ అజంతా టీ సెంటర్ ఏరియాలో సరియైన ధ్రువపత్రాలు చూపించని వాహనదారులకు
చలానాలు పోలీసులు విధించారు. శనివారం రాత్రి ఏలూరు ఒకటవ పట్టణ సి ఐ. జి. సత్యనారాయణ, ఎస్సై నాగబాబు, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. రవాణా శాఖ చట్టం లోబడి ప్రతి ఒక్క వాహనదారుడు వాహనాన్ని నడపాలని పోలీసులు హెచ్చరించారు. లేనిచో చర్యలు తీసుకుంటామన్నారు.