ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం నాయకులగూడెం నాయకుల కులస్తులు తమకు ఎస్టీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరుతూ ఆరు రోజులుగా తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసనలు చేస్తున్నారు. శనివారం గ్రామస్తులంతా కలిసి మోకాళ్ళపై కూర్చుని తమ డిమాండ్లను తెలియజేశారు. వెంటనే తమ కులానికి ఎస్టీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని వారు అధికారులను కోరుతున్నారు.