ఏలూరు స్థానిక పోలీసు పెరేడు గ్రౌండులో పెదవేగి పోలీసు ట్రైనింగు సెంటరు (PTC) ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండ్రీ క్యాడెటు ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల (SCTPC) పాసింగు ఔట్ పరేడు జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని, ఏలూరు రేంజీ ఐజి జి. వి. జి. అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) లు పాల్గొన్నారు.