వేలేరుపాడులోని కొయిదాలో గోదావరి వరదల కారణంగా నది ఒడ్డున మట్టి కోతకు గురై, పురాతన వృక్షాల వేర్లు బయటపడ్డాయి. భూమి గర్భంలో ఉండాల్సిన ఈ వేర్లు ఇప్పుడు గాలిలో గొలుసుకట్టు అల్లికల్లా వేలాడుతూ చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పాపికొండల విహారయాత్రకు వెళ్లేవారు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్నారు.