రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఏలూరు ఆర్టీసీ గ్యారేజీలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ మీటింగ్‌లో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనదని, సుఖప్రదమైనదని తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్లపై ప్రజలకు ప్రత్యేక నమ్మకం ఉందని, ఎంత ఆలస్యమైనా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చుతారనే విశ్వాసమే ఆర్టీసీకి బలమని పేర్కొన్నారు.