ఏలూరు: పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తెకు ‘గ్రూపు-2’ ఉద్యోగం

402చూసినవారు
ఏలూరు: పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తెకు ‘గ్రూపు-2’ ఉద్యోగం
కష్టానికి పట్టుదల తోడైతే విజయం వరిస్తుందని ఏలూరు నగర కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుడు నాగన్న కుమార్తె సౌజన్య నిరూపించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా శ్రమించి, ఆమె గ్రూపు-2 ఫలితాల్లో డిప్యూటీ తహశీల్దార్‌గా ఎంపికయ్యారు. తల్లిదండ్రుల ఆశలను నిజం చేస్తూ రెవెన్యూ శాఖలో ఉన్నత ఉద్యోగం సాధించిన సౌజన్యను పలువురు విద్యావంతులు, ప్రముఖులు అభినందించి ఆమె భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్