ఏలూరులో ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జరగనున్న పడమర వీధి గంగానమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు విధించినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. కైకలూరు నుంచి వచ్చే భారీ వాహనాలు లోకుమూడి మీదుగా ఆకివీడు, భీమవరం వైపు వెళ్లాలి. హనుమాన్ జంక్షన్ వైపు వెళ్లేవారు గుడివాడ మీదుగా ప్రయాణించాలి. ఆశ్రమ మెడికల్ కాలేజీ, వట్లూరు జంక్షన్ నుంచి ఏలూరులోకి భారీ వాహనాలను అనుమతించరు.