ద్వారకాతిరుమలలో ఆస్తి వివాదంలో సొంత తమ్ముడిని హత్య చేయడానికి అన్న సుఫారీ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. కంపసాని రామకృష్ణ, చింతలపూడికి చెందిన అన్న సత్యనారాయణ మధ్య ఆస్తి తగాదాలున్నాయి. ఆస్తి దక్కించుకోవాలనే దురుద్దేశంతో సత్యనారాయణ, ఇద్దరికి రూ. 10 లక్షలు ఇచ్చి రామకృష్ణను హతమార్చాలని ప్రయత్నించాడు. అయితే, ఈ విషయం తెలిసిన రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.