ఏలూరు: విద్యుత్తు ప్రమాదంలో మూడు గేదలు మృతి

1283చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలగలపల్లి గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వెలగలపల్లి గ్రామానికి చెందిన గోలి సత్యనారాయణ రెడ్డికి చెందిన మూడు గేదెలు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ వైరు తెగిపడటంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాయి. సుమారు మూడు లక్షల రూపాయల విలువైన గేదెలను కోల్పోయిన రైతు సత్యనారాయణ రెడ్డి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :