గురువారం తెల్లవారుజామున నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారిపై ఏలూరు జిల్లా పెదపాడు మండలం గుడిపాడు నుంచి చెన్నై వేలాంగిని చర్చికి వెళ్తున్న టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుడిపాడు గ్రామానికి చెందిన 51 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.