ఏలూరు జిల్లా వట్లూరు శివారు సౌరిపురానికి చెందిన వైశాలి (34) గత నెల 18వ తేదీ నుండి కనిపించకుండా పోయారు. పోలీసులు విచారణ చేపట్టగా, ఆమె హత్యకు గురైనట్లు నిర్ధారించారు. నూజివీడు మండలం పల్లెర్లమూడి పట్టిసీమ కాలువ సమీపంలో పూడ్చిపెట్టిన ఆమె మృతదేహాన్ని పోలీసు బృందాలు గురువారం వెలికితీశాయి. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు.