ఏలూరు జిల్లా, టీ నర్సాపురం మండలం కొల్లువారిగూడెం గ్రామ సమీపంలో గురువారం ఆంధ్ర నుండి తెలంగాణకు అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రిప్పర్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. విచారణ నిమిత్తం టీ నర్సాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రాథమికంగా ఇసుక మాఫియాకు చెందిన తెలంగాణ వాసి గద్దల శ్రీను అనే వ్యక్తిని గుర్తించారు. అతను బడా నేతలు తన వెంట ఉన్నారని చెబుతున్నట్లు సమాచారం.