ఏలూరు: పోలీస్ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

543చూసినవారు
ఏలూరు: పోలీస్ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌కు తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళ చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. పెదవేగి మండలం కల్వకుంటకు చెందిన వివాహిత తన భర్త వేధిస్తున్నాడంటూ బుధవారం మహిళా పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో కుటుంబసభ్యులతో జరిగిన ఘర్షణలో మనస్థాపం చెందిన ఆమె స్టేషన్ బయట ఉన్న స్నానాల గదికి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్