ఏలూరు నగరంలో గండేటి మేఘమాల అనే మహిళ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. భీమవరానికి చెందిన అనిల్ కుమార్ ను వివాహం చేసుకున్న మేఘమాల, ఈ నెల 22న తూర్పు వీధి జాతర కోసం భీమవరం నుంచి ఏలూరు వచ్చింది. సోమవారం భీమవరం తిరిగి వెళ్లాల్సిన ఆమె వెళ్ళకపోవడంతో, తల్లిదండ్రులు మంగళవారం ఏలూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భర్తపై అనుమానం వ్యక్తం అవుతోంది.