కొయ్యలగూడెం (M) అచ్యుతాపురంలో ఆదివారం నవీన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను కొనుగోలు చేసిన స్థలం ముందు నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడాన్ని అతడు తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇదే క్రమంలో విగ్రహాల శంకుస్థాపనకు వచ్చిన నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తూ తనపై పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, నాయకులు అతడిని రక్షించి, చికిత్స నిమిత్తం కొయ్యలగూడెం ఆసుపత్రికి తరలించారు.