ఏలూరు నగరానికి చెందిన వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తోటకూర కిషోర్ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. వారి భౌతిక కాయానికి ఏలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ పూలమాలవేసి నివాళులర్పించారు. కిషోర్ మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.