ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా 2026-2027 సంవత్సరానికి మొదటి గ్రామ సభ సమావేశం జరిగింది. మండల అభివృద్ధి అధికారి (MPDO) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, గ్రామ అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రేగంటి రాంబాబు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.