సరైన పత్రాలు లేకుంటే చిక్కుల్లో పడతారు: ఏలూరు సీఐ

0చూసినవారు
సరైన పత్రాలు లేకుంటే చిక్కుల్లో పడతారు: ఏలూరు సీఐ
ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపీ మేస్త్రి కాలనీలో సీఐ అశోక్ కుమార్ శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలను కొనుగోలు చేస్తే చిక్కుల్లో పడతారని ప్రజలను హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు 8 ప్రత్యేక బృందాలతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించినట్లు సీఐ అశోక్ కుమార్ వివరించారు.

సంబంధిత పోస్ట్