ఏలూరు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా పి. జగదాంబ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, జగదాంబను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలని చైర్‌పర్సన్ సూచించారు. జగదాంబకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.