ఏలూరులోని కొప్పుల వెలమ కళ్యాణ మండపంలో "
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ప్రారంభ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ అబ్జర్వర్, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు స్థానిక నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, రాబోయే రోజుల్లో పార్టీ పూర్తిస్థాయి నిర్మాణాన్ని, సంస్థాగత బలాన్ని పెంచడమే ఈ కమిటీ లక్ష్యమని తెలిపారు.