జంగారెడ్డిగూడెం: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

2చూసినవారు
జంగారెడ్డిగూడెం: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ప్రేమించిన యువతి నిరాకరించడంతో మనస్తాపం చెందిన మోహిద్ సహెబ్ (20) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన మోహిద్, జంగారెడ్డిగూడెంలో ఒక సెలూన్లో పనిచేస్తున్నాడు. ముంబయిలో పనిచేస్తున్నప్పుడు పరిచయమైన యువతి స్పందించకపోవడంతో మనస్తాపం చెంది, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్