కారులో నిద్రిస్తున్న మహిళ మెడలోంచి నగలు చోరీ

8చూసినవారు
కారులో నిద్రిస్తున్న మహిళ మెడలోంచి నగలు చోరీ
ఏలూరు ఆశ్రం కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై కారులో నిద్రిస్తున్న మహిళ మెడలోని 33 గ్రాముల బంగారు నగలను ఇద్దరు దుండగులు అపహరించినట్లు రూరల్ ఎస్సై వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. విశాఖ జిల్లా యండాడకు చెందిన అమర్‌నాథ్‌రెడ్డి కుటుంబంతో హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్తూ విశ్రాంతి కోసం కారు నిలిపారు. ఏసీ పనిచేయక అద్దాలు దించుకుని నిద్రించగా దుండగులు రెండు లాకెట్లను లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్