బుధవారం అర్ధరాత్రి నుండి జంగారెడ్డిగూడెం పట్టణంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు పొంగి పొర్లాయి. బుట్టాయిగూడెం రోడ్డులోని చెరువు పొంగడంతో రోడ్లపైకి వర్షపునీరు చేరింది. దీంతో చేపలు పంట పొలాల్లోకి రావడంతో ప్రజలు వాటిని పట్టుకోవడానికి ఎగబడ్డారు. పలువురు చేపలను పట్టుకొని సంతోషంగా ఇళ్లకు తరలించారు.