చేపల పెంపకానికి ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సులో మఖానా (ఫాక్స్ నట్స్) సాగుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్థానిక సహజ వనరులతో అధిక ఆదాయం పొందవచ్చని, కలువ గింజల నుంచి మఖానా ఉత్పత్తి చేయవచ్చని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో సూచించారు. దీనివల్ల రైతులకు కొత్త ఉపాధి లభిస్తుందని, కొల్లేరు ముఖచిత్రం మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.